‘రాయీస్’ ట్రైలర్ దుమ్ము లేపింది

డియర్ జిందగీలో జిందగీ గురించి చెప్పిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు దందా గురించి చెప్తున్నాడు. ‘అమ్మీ జాన్ కహథిథీ కోయి దందా చోటా నహీ హోతా.. ఔర్ దందాసే బడా కోయి ధరమ్ నహీ హోతా’ (అమ్మ చెప్తుండేది ఏ చిన్న వ్యాపారమైన చిన్నదేమి కాదు, అలాగే వ్యాపారం కంటే పెద్దగా చెప్పే ధర్మం ఏది లేదు’

55853059

దీనికి కౌంటర్ నేచురల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఇలా ఇచ్చాడు.. ‘జిస్ కు తూ దందా బోల్తా హైనా.. క్రైమ్ హై వో.. దందా బంద్ కర్లే.. వార్నా సాస్ లేనా బీ ముష్కిల్ కర్లూంగా ‘ (నువ్ ఏదైతే దందా అని చెప్తున్నావో అది క్రైమ్.. ఆ దందా మానేయ్ లేకపోతే ఊపిరి తీసుకోటాన్ని కూడా కష్టంగా చేస్తా). తాజాగా విడుదలయిన ‘రాయీస్’ సినిమా ట్రైలర్ లోని డైలాగ్ ఇది.

55853200

1980లో గుజరాత్‌లో అక్రమంగా కల్తీ మద్యం వ్యాపారం చేసే రాయీస్ ఆలమ్ అనే వ్యక్తిని ఏసీపీ గులామ్ పటేల్ ఎలా అడ్డుకుంటూ వచ్చాడు. వారిద్దరి మధ్య ఎలాంటి సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగాయి. చివరికి అక్రమ కల్తీ మద్యం వ్యాపారం ఆగిందా ? లేదా అనే కథాంశంతో బాలీవుడ్‌లో ‘రాయీస్’ అనే సినిమా తెరకెక్కుతోంది. రాయీస్ అంటే ఉర్దూలో పాలకుడు అని అర్థం.

raees2

ఈ సినిమాలో రాయీస్ పాత్రలో షారుఖ్ ఖాన్ నటిస్తుండగా, పోలీస్ అధికారి పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నాడు, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రితేష్ సిద్వాణీ, గౌరీ ఖాన్ మరియు ఫరాన్ అక్తర్ నిర్మాణంలో డైరెక్టర్ డైరెక్టర్ రాహుల్ ఢోలకియా ‘రాయీస్’ ను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తన గత చిత్రాలకు భిన్నంగా అగ్రెసివ్‌గా మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. షారుఖ్ డైలాగ్స్, యాక్షన్స్ దుమ్ములేపేలా ఉన్నాయి. జనవరి 25న ఈ సినిమా విడుదలవుతోంది.

Read also- आखिर वो आ गया… शाहरुख की #रईस का ट्रेलर लॉन्च

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*